సందేహము లేని తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సందేహము లేని తలంపులు :

యాకోబు 1:6 - "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను".

సందేహపడుటవలన మనకు ప్రమాదం పొంచియుంది. మనము ద్విమనస్కులుగా అస్థిరులుగా మారిపోయే అవకాశముంది. దేవుని యొక్క నీతిపైన మనము సందేహాపడినప్పుడు ఆయనను మనం ఆయన పట్ల విధేయులుగా ఉండలేము. దేవుడు తాను ఏమయివున్నాడని వాక్యము వివరించుచున్నదో వాక్యమును కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మనయెడల దార్థముగా, నమ్మకమైనవానిగా ఉన్న దేవుడు. అది నీవు అర్థం చేసుకోక కలవరపడే సందర్భాలు ఉండవచ్చు‌. కానీ ఒక విశ్వాసికి శ్రమలను ఎదుర్కొనే శక్తి దేవుని శక్తి పైన ఉన్న విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ప్రార్థనా మనవి:

ప్రియ పరలోక తండ్రి!!! నీ యొక్క శక్తిని, మహిమను బట్టి నీకు వందనములు. నా జీవితంలో నీవు చేసిన ఉపకారములకై నీకు వేలాది స్తోత్రములు. శ్రమలలో పరిస్థితులమీద గాక నీ శక్తిపై దృష్టియుంచుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Doubtless Thoughts:  James 1:6 - “But let him ask in faith, with no doubting.” There is a danger associated with doubt. We can become double-minded and unstable. When we doubt that God is righteous and good, we will not be willing to obey and serve Him.  Believers must cling to the biblical truth about who God says He is in His Word. Our God is in control at all times, and He is good, trustworthy, and just.There might be circumstances where you are struggling to believe God’s goodness. But A believer’s strength during uncertain times comes from trust and faith in God’s sovereignty and inherent goodness. 

Talk to The King: Father God, I thank You for Your power and glory in my life.  Remind me that anything and everything good in my life is solely because of You.  Help me to focus on You and not my circumstances. In Jesus’ name. Amen.