సంపూర్ణమైన తలంపులు - Complete Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సంపూర్ణమైన తలంపులు:
యాకోబు 4:7 - "దేవునికి లోబడియుండుడి".

దేవునికి మనము కొంచెముగా కాకుండా సంపూర్ణంగా కావాలి. ప్రభువా! సమస్తము నీకే అంకితం అని చెప్పడము సులువే కానీ మనకిష్టమైనది ఆయనకు ఇవ్వడం చాలా కష్టం. ఆయన మనమెట్టి రీతిగా ఉన్నా మనలను ప్రేమించు దేవుడు. మనలను సృష్టించిన ఆయనకు సమస్తమూ తెలుసు. మన హృదయమును, మనస్సును ఆయనకు యిచ్చినపుడు దేవుని వలన కలుగు ఆనందాన్ని మనం పొందుకోగలము. దేవునికి ఏ విషయాలలో నీవు దూరముగా ఉన్నావో ఆలోచించుకొని ఆయనకు లోబడియుండుటకు నిశ్చయించుకొనుము. దేవునికి నీవు లోబడినప్పుడు ఆయన నడిపింపులో నీవు ఉంటావు లేదంటే లోకములో నికి పడిపోతావు.

ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! నీ అధికారమునకు సంపూర్ణంగా లోబడి జీవించుటకు మాకు సహాయం చేయుము. వేరే ఏ విషయములోనూ మేము తప్పిపోకుండా నీయందు ఎడతెగని విశ్వాసము కలిగియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Complete Thoughts:
James 4:7 - So give yourselves completely to God.” God doesn"t just want pieces of us, He wants ALL of us! It is easy to tell God He can have the parts we want to give Him, but it is more difficult to give Him the pieces we want to hold onto ourselves. He loves us just the way we are! He created us and knows everything about us! When we give Him our heart and soul, our breath, movements, words and actions we can experience joy that only comes from God. Ponder if you still have things you have kept from God, areas where you are not ready to submit to him or people you are not ready to let go even though they lead you away from God. Give your all to God. All means everything.

Talk to The King:
Father God, help me submit myself completely to You and Your authority. Let me not keep anything or anyone to myself but let me give my all to You. In Jesus name, I pray, Amen.