విశ్వాస తలంపులు - Faithful Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

హెబ్రీయులకు 11:1 - "విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది".

నిజమైన ఆశకు ఒః బలమైన మరియు యధార్థమైన పునాది అవ‌సరం. పరిస్థితులు మనలను కంపింపజేసినా స్థిరంగా నిలిపేది ఆ పునాదియే. మనము శ్రమలలో ఎదురీదుతున్నప్పుడు దేవుని వాక్యము వైపు చూచి సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవని విశ్వాసముంచాలి. గనుక మనం ఆయనపై ఆధారపడి ముందుకు సాగిపోవాలి. అప్పుడే ఆయనయందు విశ్వాసము అధికమై మనం ఆత్మీయంగా బలపడతాము విశ్వాసములో స్థిరపడతాము. మనము బలపడిన విధంగా ఆయనయందు మన విశ్వాసము బలపడుతుంది. మరియు ఆయన యొక్క వాగ్దానములపై ఆధారపడితే మన విశ్వాస జీవితం బలపడుతుంది.

ప్రార్థనా మనవి:
ప్రియమైన తండ్రి!!! నేను నీ యొక్క ప్రేమనందు నమ్మికయుంచియున్నాను. నన్ను రక్షించిన నీ అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచియున్నాను. నా విశ్వాసమును బలపరచుమని
యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Faithful Thoughts: Hebrews 11:1- “ Faith is the substance of things hoped for, the evidence of things not seen” True hope requires a firm, substantive foundation. It’s the only foundation when everything is shaken. When we’re suffering through hard times, we take God at his Word and believe that he’s still in control, with a specific purpose in mind. So we keep going, relying on him. As we keep going, hour to hour, day to day, week to week, we become stronger. Our faith grows, our maturity grows, our trust in God grows. As we get stronger, we believe in God’s goodness, more than our circumstances. We learn to believe in God’s promises.Belief in God can be your firm foundation. If you still want to believe, then God will meet you in the midst of your efforts to believe. 

Talk to The King:
Father God, I’m choosing to believe in your goodness and love. I believe in Jesus, your Son, and what he did to save me. Please let my faith be my foundation. In Jesus name, I pray, Amen.