నమ్మికయుంచు తలంపులు - Trusting Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

నమ్మికయుంచు తలంపులు:
సామెతలు 3:5 - నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము.
కొన్ని సమయాల్లో దేవుని ఆజ్ఞలకు
లోబడియుండడం చాలా కష్టముగా ఉంటుంది. అటువంటప్పుడే మనం మన విశ్వాసమును కోల్పోకుండా పరిస్థితిని దేవుని హస్తములకు అప్పగించాలి. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు బంధాలు, ఉద్యోగం, వ్యాపారములు... ఇలా ప్రతీ విషయంలో ఎన్ని సమస్యలున్నా మనము ధైర్యముగా ముందుకు అడుగు వేయగలము. మన జీవితాల్లో మనము ఎంతో ప్రేమించేవారిని ఆయన తీసివేయగలడు... అది మన మంచికే. ఆయన తన పిల్లలయెడల గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు. ఆయన నీ హృదయమును కలవరపడనియ్యడు. ధైర్యముగా నుండుము. అనుదినం ప్రార్థించెదము. ఆయనను స్తుతించి మహిమపరచుదాం.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నన్ను నా జీవితంలో నడిపించుచున్నందుకు నీకు వందనములు. నా యెడల కలిగియున్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రము. ప్రతీ శ్రమలో నీయందు విశ్వాసముంచి ముందుకు సాగిపోవడానికి ‌సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్‌!

Trusting Thoughts:
Proverbs 3:5 - “Trust in the Lord with all your heart, And lean not on your own understanding.” Sometimes it is hard when you obey God. Learning to “let go and let God” is all about complete and total trust. When you learn to trust God with your whole life and let go of things, relationships, careers, or even businesses, you can’t help but know that God is in it. It is only natural for you and those surrounding you to have high hopes and dreams for your life. Sometimes God will remove people and things from your life otherwise you would settle. God knows the best plan for His children. When God begins to call and stir your heart, stop resisting. Stop trying to be God and direct your own path. Pray that you will hear from God and that He will direct your path. All you need to do is obey.

Talk to The King:
Father God, thank You for the way you lead and guide me in life. Thank You for Your plans in life. Help me to trust in Your plans always. In Jesus name, I pray, Amen.