ఆధారపడియున్న తలంపులు - Clinging Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

ఆధారపడియున్న తలంపులు:
ఫిలిప్పీయులకు 2:13 - "మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే."

నీవు నీ యొక్క భయాలను, బంధకాలనుండి విముక్తుడవైనపుడు దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలా నీవు ఉంటావు. ఈ సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా నిన్ను మభ్యపెట్టాలని అపవాది ఎన్నో శోధనలు మనకు కలుగజేస్తాడు. సత్యమేమిటో మనం తెలుసుకొన్నప్పుడు అపవాది ఆటలు ఇంక సాగవు. గనుక సత్యమేమిటో తెలుసుకొనుటకు ప్రయత్నించుము. దేవునిపై ఆధారపడి ఆయననే అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అపవాది మనలను ఏం చేయలేడు. లేకపోతే నిన్ను నువ్వు కోల్పోయి సాతాను చెరలో పడి నశించిపోతావు.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నన్ను సాతాను చెరనుంచి తప్పించుచున్నందుకు నీకు వందనములు. సాతాను శోధనలలో పడక అన్నివేళలా నిన్ను అంటిపెట్టుకుని యుండుటకు మరియు నీ యొక్క చిత్తానికి లోబడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Clinging Thoughts:
Philippians 2:13- “ for it is God who works in you.” When you are set free from all of those insecurities and fears, you are allowing yourself to finally be exactly who God created you to be, PERFECTLY YOU. Satan knows that once you know the truth about who you are, he can no longer mess with you. He will keep trying, but once you know the truth, you become aware of his tactics and schemes and will have wisdom. So don""t give Satan a chance to mess with you. Cling to God with deep and intense yearnings. When we don’t cling to God, we get lost and forget who we are, and that’s when the devil begins to whisper lies in our ears and we begin to believe those lies.

Talk to The King:
Father God, thank You for guiding me out of Satan""s lies. Help me cling onto You at all times. And never let me listen to lies. Help me believe in Your perfect plan. In Jesus name, I pray, Amen.