గ్రహించు తలంపులు - Perceptive Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

గ్రహించు తలంపులు:
యెహెజ్కేలు 36:27 - "నా ఆత్మను మీయందుంచెదను".

మన ప్రతీ రోజూ ఉరుకులు పరుగులతో నడుస్తుంది. కొన్నిసార్లు మనం నిత్యం చేస్తూ
ఉండే కార్యములు మన జీవితంలో ఏ మార్పు తీసుకురాక
మనలను బాధపెడతాయి. కానీ పరిస్థితులను వేరే కోణంలో చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న మార్పు మన ఆలోచనను మార్చి మనమెన్నడూ ఊహించని రీతిగా మన జీవితాన్ని సానుకూలంగా మార్చవచ్చు. నిన్ను ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టుచున్న శ్రమలను జయించుటకు దేవుడు మనకు జ్ఞానమిచ్చియున్నాడు. ఈ జీవితంలో నీవు వేదనను, బాధను, నొప్పిని భరించవలసి రావచ్చు. కానీ దేవుడు తన ఆత్మను అనగా ఆదరణకర్తను మనకు అనుగ్రహించాడు. గనుక మనం ఇంక చింతింపనవసరం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ఆయనయందు విశ్వాసముంచి ధైర్యముగా ముందుకు సాగిపోదాము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీవు నన్ను నడిపించుచున్న విధానమును బట్టి నీకు వందనములు. నేను ఎన్నో చిక్కుల నడుమ ఉన్నా తగిన జ్ఞానమిచ్చి ముందుకు నీ నీయందు ఆధారపడుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్. ‌

Perceptive Thoughts: Ezekiel 36:27- “ I will put My Spirit within you.” Each day begins with a rush, a dread. Sometimes whatever we do does not change things in our lives and that keeps us worried. But what would happen if you saw the situations differently?  Do not underestimate how a change in your perception can bring the positive change you never dreamed could be true.In all such problems, these struggles, God can bring wisdom, a new way of approaching what has been troubling you for so long. In this life, you have trouble, heartache, worry. But He is here to walk with you in each circumstance. You can trust Him, turn to Him, or you can continue to ignore His outstretched hand and go forward, on your own, completely alone. Choice is yours. Change your perception of looking at things with the help of God.

Talk to The King: Father, thank You for the way You guide me to perceive things differently. Though I am amidst struggles, help me to rely on You and Your wisdom and be lead in Your light. In Jesus name, Amen.