సృష్టికర్త యొక్క తలంపులు - Creator""s Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సృష్టికర్త యొక్క తలంపులు:
కీర్తనలు 100:3 - "యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము".
దేవుడు మనయెడల కలిగిన్న ఉద్దేశముతో చిన్నవి ఏవియూ లేవు. దేవుడు పిచ్చుకలు గురించి కూడా లక్ష్యపెట్టువాడు మనయెడల నిర్లక్ష్యంగా ఉండడు. మన ఇష్టాయిష్టాలను ఎఱిగినవాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించు దేవుడు. కానీ ఐహికమైన మన కోరికలు మన యిష్టాలం దేవుని నుండి మన దారిని మళ్ళిస్తాయి. ఆయన పని చేయుటయందు ఆయన రాజ్యానికి సిద్ధపడుటయందు ఆటంకపరుస్తాయి. ఆయనే మనలను సృష్టించిన అన్నియూ మనకు సమకూర్చినవాడు. మన ప్రతీ అవసరాలను తీర్చి మనలను నడిపించువాడు. మన కుటుంబములు, స్నేహితులు, ఉద్యోగము విషయంలో ప్రతీ విషయములో తోడై యున్నాడు. ఆయన మన దేవుడు మనము ఆయన వారము. ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయనను విడువకయుందము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!??? నా ప్రతీ అవసరతను తీర్చి నా ప్రతీ శ్రమలో నాకు తోడైయున్నందుకు నీకు వందనములు. నీ చిత్తమును నెరవేర్చుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Creator""s Thoughts:
Psalms 100:3 - “Know that the Lord , He is God; It is He who has made us.” There are no small things in the economy of God. God cares about sparrows and lilies, about calendars and phones, about your likes and dislikes etc because God cares about us, and each of these things can draw us closer to Him or distract us from the work of building His kingdom and the joy of living as His beloved. He created us and He will never leave us by ourselves but is interested and loving enough to take care of each of our heart""s desires. God is at work, friends. In you, in me, in our families, in the world. He is here. We are here. Let us notice. And maybe, with His help, we can even take part in this beauty and grace, too.

Talk to The King:
Thank You Lord for taking care of each of my big and small desires. Let me with Your help fulfill Your Will in my life . In Jesus name, Amen.