క్రమబద్ధీకరించు తలంపులు - Decluttering Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

క్రమబద్ధీకరించు తలంపులు:
యోహాను 10:10 - "జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని".

మన జీవితమంతయూ ఈ లోకసంబంధమైన విషయములో నిండిపోవడం వలన దేవునికి ఇవ్వవలసిన శ్రేష్ఠమైన ‌‌సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. సాతాను యత్నాలు మనలను దారి మళ్ళింపజేస్తున్నాయి. మన చదువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సంసార బాధ్యతలు ఇలా ఏదోక విధంగా మన సమయం ఖర్చయిపోతుంది. వృథా అవుతుంది. వీటినన్నిటినీ క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉంది. అప్పుడే నీకు ఏవి ముఖ్యమైనవో ఏవి కావో తెలుస్తుంది. మనకు ముఖ్యం కాని వాటిని మనం జీవితంలో నుండి తొలగించుట ద్వారా మనకు శాంతి,
సమాధానం, నిజమైన సంతోషం అన్నీ లభిస్తాయి. మన ఆత్మ నూతన ఉజ్జీవాన్ని పొందుతుంది. మనమెప్పుడైతే ఒక క్రమాన్ని కలిగియుంటామో అప్పుడే దేవుడు మన జీవితాలను ‌సరిచేసి మనలను బలపరుస్తాడు.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నా జీవితాన్ని నీ కృపతో నింపినందుకు నాకు వందనములు. అనవసరమైన వాటిని నా జీవితంలో నుండి తీసివేసి నీ ప్రణాళిక చొప్పున నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Decluttering Thoughts: John 10:10- “I have come that they may have life, and that they may have it more abundantly.” Our lives are so filled with the things of the world that most of us fail to spend quality time with God. One of the types of Satan""s tactics are keeping us busy. Be it out jobs, cleaning our homes, job related homeworks, and presently the social media etc..all of them kill our time. It""s time to give God your time. Start Little by little to try to cut off things which are inessential. Then you will learn what is truly essential and what isn’t, and with each nonessential thing we let go of, our hearts will grow calmer, quieter, more open, and more joyful. Our souls will grow lighter. And each and every time God pries our hands off of the things we clung to, He will fill them anew with more of Himself. Let God work on You.

Talk to The King: Thank you Father for the way You fill us with Your life. Help me declutter inessential things in my life and let me fill You in my life. In Jesus name, I pray, Amen.