దాచియుంచు తలంపులు - Treasured Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

దాచియుంచు తలంపులు:
మత్తయి 6:20 - "పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి".

మన విశ్వాసము వస్తువులపై ఉండకూడదు. మన భద్రత మన క్షేమం వాటిలో ఉండదు. అవి ఎప్పటికీ శాశ్వతం కావు. మన యిల్లు, ఆస్తిపాస్తులు, వస్తువులు ఇవన్నీ కొంతకాలానికి పాడైపోతాయి, శిథిలమైపోతాయి కనుమరుగైపోతాయి‌. దేవుడు వీటిని ఎప్పుడూ లక్ష్యపెట్టడు. అవి కేవలం మన అవసరాల కొఱకు అనుగ్రహించబడ్డాయి గనుక వాటియెడల అధికమైన ఇష్టాన్ని కలిగియుండకూడదు. ఆయన ఎప్పుడూ మన హృదయం, మనసు, ఆత్మ, పొరుగువాని యెడల మనము కలిగియున్న ప్రేమ... వీటినే లక్ష్యపెడతాడు. హృదయశుద్ధి కలిగి దేవుని ప్రతీ ఆజ్ఞను పాటించుచూ సత్ క్రియలను చేయునప్పుడు పరలోకమందు మన ధనము అధికమవుతుంది. ఆ ధనము శాశ్వతకాలముంటుంది. ఈ లోకములో మనము సంపాదించుకున్న ధనం మనలను ఎన్నటికీ పరలోకము చేర్చలేదు.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! ఈ ఇహలోక విషయములపై నేను లక్ష్యముంచకుండా పరలోక రాజ్యము వైపు నన్ను నడిపించుచున్నందుకు నీకు వందనములు. సదా పైనున్న వాటినే వెదకుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Treasured Thoughts: Matthew 6:20- “Lay up for yourselves treasures in heaven.” Our trust cannot be in things. Our safety and security must not be rooted in them. They don’t, can’t, won’t last. Cars, houses, toys, clothing—they rust, age, break, and go out of style. After all, God isn’t a God of stuff. He has very little interest in our possessions, except to remind us that they must never be our utmost concern. Instead he cares for us—body, mind, and soul—and points us toward caring for our neighbors. The less stuff you have to manage, the better. Instead God asks us to lay up treasures in heaven so that they are eternal.

Talk to The King: Father, thank You for the way guide me to not get attached to earthly things for my citizenship is in heaven. Help me always to look at heaven. In Jesus name, Amen.