సిద్ధపరచు తలంపులు - Preparing Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

సిద్ధపరచు తలంపులు :
యోహాను 14:1 - "మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి".
చిరునవ్వు ముసుగుతో ఉన్న మన మొహం వెనుక గాయపడిన మన హృదయం ఉంది. కారణం ఏదొక భయాందోళనను నీ హృదయంలో కలిగియుండవచ్చు. జీవితం శ్రమలతో కూడుకొన్నది. అది ప్రతీ ఒక్కరికీ సర్వసహజం. దేవునికి అదంతయూ తెలుసు. ఆయన నీకు సహాయము చేయువాడు.
గనుక ఆయనయందు నమ్మికయుంచుము. నీకు ఏ శ్రమ ఎదురైనా ఆయన నీకు తోడైయున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ ఒంటరిగా విడువడు. శ్రమలు, అపజయాలు ఈ జీవితంలో మామూలే గనుక వాటిని గురించి కలవరపడనవసరం లేదు. అవి మనలను ఇంకా బలపరచడానికే. మనమందరమూ మన తండ్రి యింట కలుసుకొనే రోజు ఒకటి యున్నది. ఆ దినము కొఱకు సిద్ధపాటు కలిగియుండుటకు ఈ శ్రమలు ఎంతో సహాయం చేస్తాయి గనుక శ్రమల ఎదురైనప్పుడు నీ హృదయాన్ని కలవరపడనియ్యక వాటిని చిరునవ్వుతో ఆహ్వానించుము.

ప్రార్థనా మనవి:
ప్రియమైన పరలోక తండ్రి!!! నిత్యజీవము కొఱకు నన్ను సిద్ధపరచినందుకు నీకు వందనములు. శ్రమలను చూచి కలవరపడక నీయందు విశ్వాసముంచి ముందుకు సాగిపోవడానికి సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Preparing Thoughts:
John 14:1-“Don’t let your hearts be troubled. Trust in God, and trust in me.” Behind our masks, most of us nurse a troubled heart. Most likely, the thing you’re worrying about right now is wrapped in fear or anxiety or guilt or frustration. Life has its problems; it’s part of being human. Jesus knows all about this. Listen to His gentle words. Let Him speak to your heart. Jesus doesn’t ignore even your trivial issue. Hard times are coming, but He will help you through this. Trust Him.There it is right in the middle of the heartache. He’s saying, It’s not always going to be this hard. You won’t always feel alone. Your heart won’t always break. Sin always will not be a trouble. A day is coming when we’ll be together again in our Father’s house. Death and pain, even failure and crushing—somehow, they’re all part of that construction process. They’re getting us ready for life beyond this atmosphere, weaning us a bit at a time from earth, preparing our lungs to breathe heavenly air.

Talk to The King:
Father, thank You for preparing me for eternity. Help me to mould myself. Help me never be troubled but trust in You. In Jesus name, Amen.