Day 138 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అత్యధిక భారమువలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచుకుండున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను (2 కొరింథీ 1: 8,9).

కష్టకాలంలో మనపై పడే వత్తిడులే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకు దక్కిన ప్రతిసారి అది ఒక కొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో కొత్తగా తెలిసివస్తుంది. దేవుడికి మానవులకీ కూడా అది మరీ ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకి వచ్చే వత్తిడులు ఇతరులకి వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాళ్లపట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి.

నలిగిపోయాను తీగలాగా సాగినట్టు తనువులోను మనసులోనూ ఆలోచనలను అంధకారం ముంచినట్లుగా శత్రువుల కింద, మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరి పోయేంతవరకు నేను నలిగి పోయాను.

నలిగిపోయాను దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా దేవుని కర్రని, బెత్తాన్ని ప్రేమించేలా స్వాతంత్రం తప్ప మాలిన్యమంతా పోయేలా నమ్మశక్యం కాని వాటిని నమ్మేలా సజీవ దేవునిలో జీవించేలా క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను.

మనలో ప్రతి దానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటుంది. ఎవరన్నా కష్టాలలో నలిగిపోతూ వాటినుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు. అతను అలాంటివారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు. మరణం మీకు అనుకూలంగా పని చేస్తుంది.

మనం ముందుకు సాగాలంటే శ్రమలు, వత్తిడులు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగభగ మండే అగ్ని జ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి, అలలకి, ఎదురై ముందుకి సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా.

బాదల గానుగలోనుండి తియ్యని ఆత్మ ద్రాక్షరసం జాలువారింది కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది.