నీకొరకు దేవుని ఉద్దేశ్యము


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

~ తొలకరి వాన తరువాత దీర్ఘమైన శ్వాసను తీసుకోవడం, వేకువనే వినే పక్షుల కిలకిలలు, దేవునితో ఏకాంత సమయాన్ని స్థిరంగా ఆనందించడం... ఇవన్నియూ మనసుకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి.

~ ఆయన సృష్టి యందు, ఆయన వాక్యమందు, ఆయనకు చేసే ప్రార్థనయందు ఎక్కువ సమయాన్ని గడుపుతుంటే ఆయన తన ఉద్దేశములను గూర్చిన ఆశా బీజములను మన హృదయములలో నాటుతాడు.

~ ఆయనకు నీవు నీ హృదయమును ఇస్తే ఆయన నీతో మాట్లాడతాడు. తన ఉద్దేశ్యము నెరవేరుటకై నిన్ను పిలుచుకుంటాడు.

~ అది నీవు ఊహించుదానికన్నా ఎంతో అధికముగా ఉంటుంది. నిన్ను ఒక ఉత్తమమైన సృజనగా ఆయన చేస్తాడు.

ధ్యానించు: ఫిలిప్పీయులకు 2:13 - “ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకు, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.”

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా పూర్ణహృదయముతో నిన్ను స్తుతించుట ఘనమైనదని గ్రహించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.