దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుము

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

~ మనము ఒక మూసధోరణిలో నడుచుకొనే క్రైస్తవుల్లా ఉన్నాము. అనుదిన వాక్యపఠనం, ప్రార్థించడం, ఆదివారం ఆరాధనల్లో పాల్గొనడం చేస్తున్నాం కానీ అతి ముఖ్యమైన సువార్తను వదిలేస్తున్నాము.

~ సువార్త అంటే దేవుని గురించి తెలుసుకోవడం కాదు; దేవునినే తెలుసుకోవడం.

~ ఆయన పాపమెరుగనివాడును పరిశుద్ధ దేవుడైయున్నాడని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. పాపం మనలను ఆయననుండి దూరం చేస్తుంది.

~ దేవుని తిరిగి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం క్రీస్తు తన ప్రాణమును మూల్యంగా చెల్లించి మనలను పాపములనుండి విమోచించడం.

~ ఈ సంగతి తెలుసుకొని ఆయనను విశ్వసించిన ప్రతీ ఒక్కరికీ అది దీవెన. దేవుడు నిన్ను చూచినప్పుడు నీ పాపములకు బదులుగా క్రీస్తు యొక్క నీతిని చూస్తాడు. ఈ సువార్తయే సమస్తమునూ మారుస్తుంది.

ధ్యానించు:
తీతుకు 3:5- “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే మనలను రక్షించెను.”

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా కొఱకు క్రీస్తు చేసిన త్యాగమును నిన్ను తెలుసుకొనుటలో ప్రాముఖ్యతను
జ్ఞాపకం చేసినందుకు నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.