క్రీస్తులో నీ నూతన ఉద్దేశ్యము ను హత్తుకొనుము

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

~ మనము గ్రహించామో లేదో ఈ భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరూ ఒక ఉద్దేశము కొఱకు చూస్తున్నారు. మనము ఐహికమైన కోరికలను గురించో, ఆనందాలను గురించో, మంచి పనులను గురించో అడుగుతాము కానీ ఇవి మనకు ఉద్దేశమును ఇవ్వలేవు మరియు మనలను రక్షించలేవు.

~ క్రీస్తునందు తిరిగి జన్మించిన విశ్వాసులమని పిలువబడుచున్న మనము ఆయన యొక్క నామమును విశ్వాసము మరియు ప్రేమతో మహిమపరచాలి.

~ విశ్వాసమునందు ధైర్యముగా నడచుట, పట్టుదలతో కూడిన నమ్మిక, ఆయనయొక్క ఎడతెగని ప్రేమను బట్టి నిత్యం యేసునామమును మహిమపరచుట మనందరి ఉద్దేశమై యున్నది.

~ గనుక మన ఉద్దేశము ఏంటో గ్రహించి మన మార్గములను సరిచేసుకోవాలి. ఈ సంగతులను మన హృదయాలలో భద్రము చేసికొని ఆయనయందు విధేయతను, కృతజ్ఞతను, ఆసక్తిని కలిగియుందము.

ధ్యానించు:
2 తిమోతికి 1:9‭-‬10 “మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, తన కృపనుబట్టియు, మనలను రక్షించెను.”


ప్రార్థన:
పరలోక తండ్రి!! నీవు నా జీవితంలో కలిగియున్న ఉద్దేశ్యమును బట్టి నీకు వందనములు. ఆ ఉద్దేశ్యము ప్రకారము జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.