దేవునితో నడచుట


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

~ దేవునితో అనుదినము నడచుటయే క్రిస్మస్ యొక్క పరమార్థం.

~ ప్రతీరోజూ క్రీస్తు మన జీవితాల్లో నూతనంగా జన్మించే విధంగా మనం ఉండాలి. కానీ ఒకే విధమైన పాత ఆరాధన క్రమాన్ని గాక నూతనముగా ఉండాలి.

~ దేవునితో నడచుట అంటే క్రీస్తు జీవించిన ప్రకారముగా ఆయనవలె మనమూ జీవించాలి. ఆయనవలె నడచుకోవాలి.

~ మన జీవితాల్లో ఎలాంటి శ్రమలు ఉన్ననూ క్రీస్తుతో నడచుటకు నిశ్చయించుకొందుము.

~ ఇహలోక విషయములతో గురి తప్పకుండా దేవునియందే మన గురిని నిలిపెదము. ఈ క్రిస్మస్ మాసమును మన జీవితాల్లో ప్రత్యేకమైనదిగా చేసికొందాము.

ధ్యానించు:
కీర్తనలు 128:1- “యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.”

ప్రార్థన:
పరలోక తండ్రి!!! ఎన్ని శ్రమలు నన్ను చుట్టుముట్టినా ఈ దినమును ప్రత్యేకమైనదిగా మలచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.