దేవుని విశ్వాస్యత


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

~ దేవుని యొక్క విశ్వాస్యతను గురించి ధ్యానించడమే క్రిస్మస్. ఆకాశంలోని ఇంద్రధనుస్సు.. నేటికీ మనకు కనిపించే దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానములు ఆయన యొక్క విశ్వాస్యతను ప్రత్యక్షపరుస్తాయి. రక్షణ గురించి ఆయన చేసిన వాగ్దానము అన్నింటిలోకెల్లా గొప్ప వాగ్దానమైయున్నది. ఈ క్రిస్మస్ మాసములో దేవుని విశ్వాస్యత మనందరిని నడిపించి విశ్వాసములో బలపరచును గాక.

ధ్యానించు:
ఆదికాండము 9:13- “మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.”

ప్రార్థన:
పరలోకమందున్న తండ్రి!!! ఈ క్రిస్మస్ మాసములో నీ యొక్క విశ్వాస్యతను ధ్యానించు భాగ్యమునిమ్మని యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.