దేవుని దీవెనెలన్నిటిని జ్ఞాపకము చేసికొనుము


  • Author: UFC
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

~ దేవుడు ఈ సంవత్సరమంతా మన జీవితాల్లో నెరవేర్చిన వాగ్దానములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ఆశీర్వాద సమయమే క్రిస్మస్ మాసము. దేవుడు మనకు ఎటువంటి మేలులు చేకూర్చాడో తలచుకొని ఆయనను స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత. లెక్కింపశక్యమైన దీవెనలను పొందుతూ ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండుటకు ప్రయత్నిద్దాం.


ధ్యానించు:
ఆదికాండము 12:2- “నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.”

ప్రార్థన:
పరలోకమందున్న తండ్రి!!! నీవు నాకు ఇచ్చిన దీవెనలను బట్టి నీకు వందనములు. నన్ను తోటివారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదంగా ఉండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.