నీ ఆత్మీయ విలువ చాలా ప్రాముఖ్యమైనది

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

✓ క్రిస్మస్ నీ యొక్క ఆత్మీయస్థితికి గురుతు.

దేవుడు నిన్ను గురించి లోకము ఏమనుకుంటుందో పట్టించుకోకుండా నీ యొక్క ఆత్మీయ స్థితిని మాత్రమే చూస్తాడు.

✓ నీవు క్రీస్తు కొఱకు తెగించి జీవించాలనుకుంటే అది సులువు ఏమాత్రమూ కాదు. కానీ అది చాలా విలువైనది. ఎవ్వరినీ లక్ష్యపెట్టకుండా ఆయనకు మనము లోబడాలి.

✓ నీ ప్రస్తుత పరిస్థితులను చూడక నీ యొక్క విధేయతను బట్టి ఆయన చేయు అద్భుతకార్యములయందు విశ్వాసముంచుము. ఎందుకనగా దేవునితో సమస్తమూ సాధ్యమే.

✓ నీ యొక్క విధేయతను బట్టి నీవు దీవెనలను పొందడానికి ముందే ఆయనను స్తుతించుము. అది నీ ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది.

✓ధ్యానించు:
లూకా 1:37- “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను.”

ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! విచారపడక నీయందు దృష్టించుటకు నీకు లోబడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.