అధిగమించగలిగే శక్తి దేవుడు దాయచేస్తాడనే విశ్వాస


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ఉరుములు, వర్షం ఉన్నప్పుడు ప్రతీ పక్షి దాచుకోడానికి ప్రయత్నిస్తాయి. కానీ, గ్రద్ధ మాత్రం మేఘాలకంటే పైకెగిరి సమస్యను అధిగమిస్తుంది.

నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది.

ఎత్తలేనంత బరువు, మోయలేనంత భారం మనకున్నా వాటిని అధిగమించగలిగే శక్తి దేవుడు దాయచేస్తాడనే విశ్వాసం మనకుంటే విజయమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్.

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు 4:13