విధేయత


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:3‭-‬6

మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును.

ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుటకు అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకూ శ్రమిస్తాడు, ఆ విషయములో ఎటువంటి సందేహము లేదు.

ఆరంభించినవాడు, ఆనందంలో నడిపిస్తూ, అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి.

విధేయతతో క్రీస్తును అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగియుండుటయే మనము చేయవలసినది.

దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక. ఆమేన్