జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము.
సామెతలు 16:16

° ఈ లోకములో మనము సంపాదించగలిగే అతి ప్రశస్తమైనది జ్ఞానము.

° మన జీవితాలు సరిగా ఉండుటకు మరియు దేవునికి దగ్గరగా ఉండుటకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ జ్ఞానము మనలను నడిపిస్తుంది.

° దేవుని జ్ఞానము మనలను నడిపించునట్లు ఆయనకు మనము లోబడినప్పుడు మనము ధైర్యముగా ఉండగలము.

° గనుక మన జ్ఞానము మీద కాకుండా దేవుని జ్ఞానము మీద ఆధారపడుటకు నిశ్చయించుకొందాము.

° ప్రార్థన:
తండ్రి! నా ప్రతీ అడుగులో నీవే తోడై యుండి, నా జ్ఞానముతో కాక, నీ జ్ఞానముతో నన్ను నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్!