మనము జాగ్రత్త కలిగి సహవాసము చేయుదము


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

° మనము ఎక్కువ సమయం సహవాసము చేయువారి పట్ల ఎలా నడుచుకుంటున్నామో ఒకసారి గమనించవలసి ఉంది.

° వారి ఇష్టమైన వస్తువులుపై మనకూ ఇష్టమవుతాయి. వారి మాట్లాడే పద్ధతి మనకును అలవాటవుతుంది. వారి అభిప్రాయాలు మన అభిప్రాయాలవుతాయి. వారి అలవాట్లు మన అలవాట్లగా మారతాయి. ఇది సహజం.

° అయితే మన చుట్టూ ఉన్నవారితో మనము కలిగియున్న సహవాసము మన జీవిత విధానంపైన ఎంతో ప్రభావితం చేస్తాయి.

° గనుక వారి విషయంలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వారి వలన మనము ఎదుగుతున్నామా?? లేక దిగజారుతున్నామా? ఎదుగుతున్నామంటే మంచిదే కానీ పడిపోతే నష్టం మనకే కదా! మనల్ని మనం అనుదినం సరి చేసుకుంటే తప్పులేదుకదా.

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును సామెతలు 13:20

ప్రార్థన:
నీ యొక్క జ్ఞానముతో నన్ను నింపి, నీ నడిపింపు చేత నేను సరైన వారితో సహవాసము చేయుటకు సహాయము చేయుము తండ్రి, ఆమేన్.