క్రీస్తుతో 40 శ్రమానుభవములు 4వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. I పేతురు 4:19

https://youtu.be/CNgG-ZLac1A

క్రైస్తవ విశ్వాసంలో శారీరకంగా కలిగే శ్రమలు ఒక అనుభవం అయితే, ఆత్మీయంగా కలిగే శ్రమలు ప్రత్యేక అనుభవాలుగా ఉంటాయి.

ఈ లోకంలో జీవించినంత కాలం ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దైవ చిత్తానుసారంగా జరిగాయి అనుకోవడం పొరపాటు. వ్యక్తిగత నిర్ణయాలు, పొరపాట్లవల్ల జరిగే పరిణామాలు దేవుని నుండి కలిగిన శ్రమలు కాదు అని అర్ధం చేసుకోవాలి.

చేయరాని పనులు చేస్తున్నప్పుడు “తప్పు” అని హృదయం గద్దిస్తే, పొరపాటు "వద్దు" అని అంటుంది. అది మదిలో నుండి వచ్చే ఆలోచన కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచలను గద్దిస్తూ, పొరపాట్లవల్ల కలిగే పరిణామాలను సూచిస్తూ మన ఆలోచనలను సరిచేయడానికి అనుక్షణం ప్రయతిస్తూ ఉంటాడు. ఈ అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలో అనగా క్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారానే పొందగలం.

ప్రత్యేకంగా దేవుని చిత్తప్రకారమైన శ్రమ అనుభవిస్తున్నప్పుడు, అపవాది మనలను ఎన్నో రకాలుగా కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుధ్దాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంటాడు.  మనం ఈ ఆత్మీయ పోరాటంలో విజయం పొందాలి అంటే మంచి ప్రవర్తన కలిగి, ఆత్మీయ జీవితం దేవునికి అప్పగించుకునే అనుభవం కలిగియుండాలి. ఇదే క్రీస్తు శ్రమలలో పొందగలిగే ఆత్మీయ అనుభవం.

తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి.  అనేక ప్రశ్నలమధ్య నలిగిపోయి తప్పించుకోడానికి ప్రత్యామ్నయ మార్గాలు వెతకడం కంటే, శ్రమ కలిగినప్పుడు దాని వెనక ఎదో ప్రయోజనం దాగి ఉంది అని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగినట్లయితే దేవుని ఉద్దేశాలు బయలుపరచబడతాయి అనుటలో ఎట్టి సందేహం లేదు.

ప్రియ చదువరి, శ్రమలు తప్పించుకోవాలనేకొద్ది అధికమవుతాయి. శ్రమలను ఎదుర్కొనే కొద్ది విజయాలు చేరువ అవుతాయి. క్రీస్తు శ్రమానుభవాలతో విజేతలం అవుతాం . నమ్మకమైన మన దేవునికి మన హృదయాలను అప్పగించి క్రీస్తు శ్రమానుభవంలో క్రొత్త అనుభూతిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్.

ఆనుభవం: శ్రమలు తప్పించుకోవాలనేకొద్ది అధికమవుతాయి. శ్రమలను ఎదుర్కొనే కొద్ది విజయాలు చేరువ అవుతాయి. క్రీస్తు శ్రమానుభవాలతో విజేతలం అవుతాం.

Experience 4:

So then, those who suffer according to God’s will should commit themselves to their faithful Creator and continue to do good. - 1 Peter 4 : 19.

https://youtu.be/ms3BF9Xjr3w

While physical suffering is an experience in the Christian faith, spiritual afflictions are the different experiences.

If you are living in this world, you must face many obstacles. It could be a mistake to think that everything has happened according to God's will. It is necessary to understand that our mistakes and our personal decisions are the reasons for those situations, and they are not the afflictions from God.

When we do something wrong, our heart keeps muttering not to do it. This is not an idea that comes from the mind. This is something which Holy Spirit guides our thoughts and tries to correct them by pointing out the consequences because of mistakes. This experience can only be gained in the Christian faith, only when we accept Christ completely.

The Holy Spirit is our helper, especially when we are experiencing the afflictions as per the will of God, then the accuser tries to oppress us in many ways.  To succeed in this spiritual battle, we need to have good behavior with an experience of surrendering our spiritual life to God. This spiritual experience can only be gained through the sufferings with Christ.

When we are going through unbearable pain or when are we are facing tough situations, we get few questions like, "why did that happened to me?". Rather than struggling between many questions and finding alternative ways to escape, let us try to move forward with multiplied enthusiasm that there is something beneficial behind it as and when we go through these afflictions. At the end you can experience the will of God.

Dear Friends, the more we try to escape from hardships, the more they get increased in our lives. When we face the tribulations, we go close to victory. We will be victorious with the Tribulations of Christ. Let us surrender our hearts to our faithful God then we have a new experience in the suffering with Jesus Christ.

Experience: The more we try to escape from hardships, the more they get increased in our lives. When we face the tribulations, we go close to victory. We will be victorious with the Tribulations of Christ.