క్రీస్తుతో 40 శ్రమానుభవములు 6వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 6 వ రోజు:
Audio: https://youtu.be/L1T0ySO9sh0

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. రోమా 8:17
మన జీవితాల్లో అనేక శ్రమలు కలిగినప్పటికి వాటిని అధిగమించగల శక్తిని ఎలా పొందాలో నేర్చుకున్న మనకు దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలులు దాచియుంచాడు అని గ్రహించాలి. అయితే విశ్వాసము వలన దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము. మనకొక కొత్త పేరు, కొత్త ఆత్మ మరియు కొత్త భవిష్యత్తు అనుగ్రహించి, రుజువుచేస్తూ... మన నుండి ఎమీ కోరుకొనకుండా మనలను దేవుని వారసులముగా, క్రీస్తుతో సహ వారసులముగా చేసియున్నాడు. ఈ వాగ్ధానం ఆయన ప్రేమవలన పొందగలిగే శాశ్వతమైన ఆశీర్వాదం.

నిరీక్షణ, నిశ్చయత లేకుండా దేవుడు లేని మన జీవితాలకు ఇప్పుడు క్రీస్తు రక్తమువలన మనలను సమీపస్తులుగా చేసికొని... వాగ్దాన నిబంధనను మన జీవితాల్లో స్థిరపరచాడు. ఈ సత్యాన్ని మన జీవితాల్లో గ్రహిస్తేనే కొత్త కోణాన్ని అన్వేషించిన వారమవుతాము. ఇదొక అద్భుతమైన అనుభవం.

క్రీస్తును అంగీకరించిన మన జీవితాల్లో కలిగే శ్రమలను గూర్చి వివరిస్తూ, అపొ. పౌలు...ఈ సమాజంలో మనకు కలిగే నిందలు, బాధలు మరియు హింసలను గూర్చి తెలియజేస్తున్నాడు. మన చుట్టూ ఉండే సమాజం సువార్తను వ్యతిరేకిస్తూ, క్రైస్తవులను శ్రమలపాలు చేస్తూ, తక్కువ వారిగా చూస్తూండటం, అంతేకాకుండా హింసించడం కూడా మనకు తెలియనిదేమీ కాదు.

ఆనాడు "క్రీస్తు మనుష్యుల వలన, సమాజం వలన ఇటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు" అనే సంగతి గాయాలతో దున్నబడిన ఆయన శరీరమే మనకు సాదృశ్యం. క్రెస్తవేతరుల వల్ల కలిగే శ్రమలు మనలను కృంగదీసినా క్రీస్తులో తన మహిమను బయలు పరచడానికేనని ఒక నూతన అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు.
లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. (యోహాను 15:18-19).


ఈ లోకము నన్ను ద్వేషించింది... ఆయినా పర్వాలేదు.

నేను క్రీస్తును విశ్వసించాను,
లోకము నన్ను వెలివేసింది...
అయినా పర్వాలేదు

నేను నా జీవితాన్ని క్రీస్తుతో జీవించాలనుకుంటున్నాను,
లోకము నన్ను వ్యతిరేకిస్తుంది...
అయినా పర్వాలేదు

"నా" అన్న వాళ్ళే నన్ను వద్దన్నారు...
అయినా పర్వాలేదు.

ఎందుకంటే ఈ శ్రమానుభవంలో క్రీస్తు నాతో ఉన్నాడు, అయన మహిమను పొందుకుంటాను అనే విశ్వాసం నాకుంది.
ఇదే నా తీర్మానం.


ప్రియ స్నేహితుడా, ఆశీర్వదించబడిన దేవుని కుమారునిగా, కుమార్తెగా జీవిస్తూ... మన ప్రాణాత్మ దేహాలను దేవునికి అప్పగిస్తూ...
ముందున్న మన జీవితంలో...
ఆయన కృపలో...
ఆయన ప్రేమలో భద్రపరచబడి,
నూతనమైన అనుభవాలను పొందుకొనుటకు ప్రయత్నిద్దాం.

అనుభవం: క్రీస్తు బాధలలో పాలిభాగం అవ్వడమంటే, ఆయన మహిమలో ఆనందాన్ని పంచుకోవడమే. ఇదే క్రీస్తుతో శ్రమానుభవం.

 

 

Now if we are children, then we are heirs--heirs of God and co-heirs with Christ, if indeed we share in his sufferings in order that we may also share in his glory. - Romans 8:17.

We can learn how to gain the strength to overcome many hardships in our lives, we must realize that God has hidden many good things in our lives.

But by faith, we were included in the family of God. He Blessed us with a new name, a new spirit, and a new future. He has made us heirs, heirs of God and co-heirs with Christ, without expecting anything from us. This promise is the eternal blessing, and he gives us beyond His love.

Christ draws attention to those who are without hope and he made us closer to Him through His blood from the cross, establishing the covenant of promise in our lives. We will be the one to explore a new dimension in our lives as we realize this truth. It is an amazing experience.

Describing the hardships due to accepting Christ in our lives, Apostle Paul speaks the reproaches, sufferings, and persecutions that befall us in this society. It is not uncommon that the society around us oppose the gospel, or we may face persecutions. His wounded body is the evidence to say that Christ suffered several hardships because of people and society. Though the afflictions by Non-Christians depress us, He is giving us an experience that it is to reveal His glory in Christ.

If the world hates you, keep in mind that it hated me first. If you belonged to the world, it would love you as its own. As it is, you do not belong to the world, but I have chosen you out of the world. That is why the world hates you. (John 15: 18-19).

• I never mind when the world hates me.
• Never mind though when I believed Christ the world isolated me.
• I never mind when I decided to live my life with Christ, even the world oppose me.
• I still don’t mind when My people reject me.

Because Christ is with me even in this suffering and I can experience it, I have faith that I will receive His glory. This is my faith experience. Hallelujah.

Dear brothers and sisters, living as the blessed Son and Daughter of God by submitting our lives, body, and spirit to Him we shall be Preserved in His glory and love. While we experience this in the coming days, let us try to get new experiences through Suffering with Jesus Christ. Amen.
Experience: To take part in Christ-s sufferings is nothing but sharing the happiness of His glory to others.

https://youtu.be/G8vHi9HZecg