క్రీస్తుతో 40 శ్రమానుభవములు 8వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 8 వ రోజు:
Audio: https://youtu.be/rWkuT2Ag1Yg

కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. I కొరింథీయులకు 12:26

నడిచే దారిలో అనుకోకుండా కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలికే కదా నొప్పి! నాకెందుకు అని చేయి అనుకుంటుందా? లేదు, వెనువెంటనే ఆ చేయి ముళ్ళను లాగివేయడానికి ప్రయత్నించి సమస్యనుండి పరిష్కారాన్ని చేస్తుంది. భరించలేని ఆ నొప్పి కేవలం కాలికే కాదు! శరీరమంతా అనుభవించాల్సిందే.

మానవుని శరీరంలోని అవయవములు ఒకదానికొకటి కలిసి ఆ శ్రమను భరిస్తూ పరిష్కారమార్గాన్ని వెతుక్కుంటాయి.

మన కుటుంబములో ఎవరికైనా సమస్య కలిగినప్పుడు ఇంట్లో ఉన్నవారంతా కలిసి ఆ సమస్యను ప్రరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. నాకేమి అవసరం అనుకుంటూ పోతే నష్టపోయేది నా కుటుంబమే కదా!. అన్న, అక్క, తముడు, చెల్లి, నాన్న, అమ్మ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని సమస్యను అధిగమించడానికి ప్రయతిస్తారు.

క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, ఒకదానికొకటైన ఆ అవయవములు క్రీస్తు సంఘములో చేర్చబడిన కుటుంబాల కుటుంబమైన విశ్వాసులే కదా! అయితే ఈ కుటుంబాల కుటుంబమైన సంఘములో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు వారికొరకు ప్రార్ధించి, పరామర్శించి, వారి శ్రమలలో సహాయము కలిగి ఉండడం క్రైస్తవ విశ్వాసులమైన మన కనీస బాధ్యత.

ఈ భారం కలిగియున్నప్పుడు సంఘమనే శరీరములో ఒక అవయవముగా ఉన్నామనే ఋజువు అవుతుంది. వారి కష్టసుఖాలలో పాలుపంపులు కలిగి ఉండడం క్రీస్తుతో శ్రమను అనుభవించిన వారమవుతాము.

అనుభవం : కుటుంబాల కుటుంబమైన సంఘములో.. వారి కష్ట సుఖాలలో పాలుపంపులు కలిగి ఉండడమే క్రీస్తుతో శ్రమానుభవం

Experience the Suffering with Christ -8th Experience
Audio: https://youtu.be/ZkAS7XLegtU

And whether one member suffer, all the members suffer with it; or one member be honored, all the members rejoice with it. - 1 Corinthians 12:26.

When a thorn accidentally pierces our leg while we are walking, does hand think that I do not care about it? No, our hand immediately tries to pull the thorn and resolves the problem. That unbearable pain is not just for the leg! The whole body must experience it. The organs of the human body work together to find a solution.

When someone in our family has a problem, everyone in the house tries to solve the problem together. If you do not care, obviously your family will be the loser. Brother, sister, father, mother all decides together and try to overcome the problem.

Just as Christ is the head of the church, all the families are included in the church of Christ as different organs of the body. So, it is our minimum responsibility as Christian believers to pray for them, consult, and assist fellow believers in the church as a family when they are in need.

To prove that we are an organ in the body of Christ, we must accept this burden by partaking and sharing in other’s hardships which is nothing but an experience of suffering with Jesus Christ.

Experience: Sharing the hardships of believers in a church is the experience of suffering with Christ.


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.