క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి 2:3
నేటికి దాదాపు 20 సంవత్సరాలైంది, కార్గిల్ యుద్ధరంగంలో మన భారతదేశం కుమారులను, తండ్రులను, అన్నదమ్ములను కోల్పోయింది. అయితే, తమ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశాన్ని, దేశ శాంతి భద్రతలను, దేశ సరిహద్దుల భద్రతను కాపాడడం కోసం ప్రాణాల్నే పణంగా పెట్టిన అమరవీరులని గర్వంగా చెప్పుకున్నాము.
- స్వచ్ఛందంగా ఆసక్తిగలవారు మాత్రమే సైనికులుగా శిక్షణ పొందగలుగుతారు.
- సైనికులు వారి మాతృభూమిని తమ శక్తితో రక్షించడం ద్వారా గౌరవిస్తారు.
- దేశం కోసం పోరాడేటప్పుడు సైనికుడు కుటుంబాన్ని మరచిపోతాడు.
- దేశ గౌరవాన్ని పరిరక్షించడంలో పాల్గొనడం సైనికులకు సంతోషం.
- దేశం కోసం వారి శ్రమ ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది.
- మరణం ఎదుటే ఉందని తెలిసినా దానిని వెంబడించటానికి పరిగెత్తుతాడు.
- యుద్ధంలో గెలిచినా, ఓడినా తమ దేశం కోసం అమరవీరులలా పోరాడుతారు
అయితే...
- క్రీస్తు శ్రమ అనుభవాల్లో పాలుపంపులు కలిగి ప్రతి శ్రమతో పోరాడి గెలిచే వీరులు కావాలి.
- తీర్మానాలకు కట్టుబడి, నియమ నిబంధనలతో పోరాడే సమర్పణ కావలి.
- నడిచే మార్గం ముళ్లబాటైనా, చివరికి మరణమైనా అంతంవరకు నమ్మకంగా ఉండే స్వభావం కావాలి.
- తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టే ఆలోచనలు లేకుండా, తన ప్రధాన లక్ష్యమైన సిలువ మర్మాన్ని ప్రకటించే సువార్తికుడు కావాలి.
- ప్రతి పోరాట కెరటాలను ఎదురీదుతూ క్రీస్తు సిలువ ఆశయ సాధనం కోసం పరితపించి ఆత్మలను సంపాధించే యోధుడు కావాలి.
- ప్రగల్భాలు పలికే అపవాదిని అణగద్రొక్కి, క్రీస్తు రాజ్యాన్ని నిలిపే సిలువ సైనికుడు కావాలి.
- భూదిగంతములకు వెళ్లి, అనుభవించిన కలువరి ప్రేమను వివరించే సేవకులు కావాలి.
సిధ్ధమా?
ఈ పాట మిమ్మును ప్రోత్సాహపరుస్తుంది :
https://youtu.be/Rp2BVJzRzIg
అనుభవం:
సిలువ మర్మాన్ని ప్రకటించాలనే ప్రధాన లక్ష్యం
క్రీస్తు రాజ్యాన్ని నిలిపే సిలువ సైనికుడు
క్రీస్తుతో శ్రమను అనుభవించే వాడు.