క్రైస్తవుని జీవన శైలిలో - దేవుని ఉద్దేశాల కోసం మీ ఆలోచనలను మార్చుకుంటారా? - Christian Lifestyle - Do you change your thoughts for God's purposes?


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Christian Lifestyle Series
  • Reference: Christian Lifestyle Series in English & Telugu

దేవుని ఉద్దేశాల కోసం మీ ఆలోచనలను మార్చుకుంటారా? మత్తయి 6వ అధ్యాయం.

క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే, జీవితంలో సాధించే వాటిని గూర్చిన ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా విజయలు పొందుతూ ఉంటాము. కొన్ని సార్లు అపజయాలను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది, కారణం..మనలోని బలహీనతలే. క్షుణ్ణంగా ఆలోచిస్తే మన బలహీనత మన ప్రత్యర్థి, దానిని జయించగలిగేది మన లక్ష్య సాధన కొరకైన ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం మనలను బలహీనతలనుండి బలవంతులను చేస్తుంది.

నాకు చాలా అనుభవం ఉంది నేను చేసేదే సరైనది అనే ఆలోచనలు మనలను కొన్ని సార్లు నిరాశలు కలుగజేస్తాయి. ఎందుకంటారు? మన సొంత నిర్ణయాల వల్ల లేదా ఎవరో చూస్తున్నారని చేసే పనుల వల్లనో లేదా మనుష్యుల మెప్పులు పొందాలని చేసేవన్నీ దేవుని నుండి ప్రతిఫలం పొందలేవు. మనకెంత అనుభవం ఉన్నా ప్రతి విషయంలో అన్నటికంటే ముందు ఆ దేవుడుంటేనే ప్రతిఫలం పొందగలం.

ఇదిలా ఉంటే, రేపేమి సంభవించునో అని ప్రతిక్షణం చింతిస్తుండే వారు ఏమి సాధించలేక పోగా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఏకాగ్రత కోల్పోయి నష్టపోతుంటారు. నేను ఏది చేసిన విజయం పొందలేకపోతున్నానను నిరాశ మనం కృంగిపోయేలా చేసి అపజయాలపాలు చేస్తుంది. అనేకసార్లు మనకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకొని వాటిగురించి చింతిస్తూ ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఏదేమైనా మనం నాయకత్వం చేయలేని విషయాల్లో లేదా దానివల్ల మనకేమి లాభం దొరకదు అనే విషయాల్లో మన దృష్టిని కేంద్రీకరించి మనసుపెట్టి పని చేయలేనప్పుడు... జరగని వాటిని గూర్చి లేదా ఏమి జరుగుతుందో; అనే చింతలో కూర్కుకుపోవడం కంటే దేవునిపై దృష్టి సారించి, చేస్తున్న పనిలో ముందుగా అయన చిత్తాన్ని యెరిగి చేసినట్లయితే విజయం మనదే అవుతుంది.

రేపేమి సంభవించునో అనే చింత, మరియు నా జీవితంలో నేను చేరుకోవాలనే లక్ష్యం; ఈ రెంటిలో చాలా వ్వత్యాసం ఉంది. యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మనకు బోధించిన విషయాలు గమనిస్తే మనం అన్నిటికంటే ముందు ఆలోచన చేయవలసింది అయన నీతిని రాజ్యాన్ని వెదికే వారంగా ఉన్నామా లేదా?. మనం చేసే ప్రతి పనిలో, చేయబోయే ప్రతి పనిలో, మన కుటుంబం లేదా ఉద్యోగం లేదా వ్యాపారం వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉన్నప్పుడే ప్రత్యేకమైన క్రెస్తవ జీవనశైలి పొందగలం. ఇట్టి విషయాల్లో విజయం పొందాలంటే ప్రార్ధనే మన ఆయుధం. ప్రార్ధించాము అనగానే సరిపోదు గాని, ప్రార్ధించి జవాబు వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. దేవుని వైపు మన ఆలోచనలను మార్చుకొని ఇట్టి విజయాలను సాధిస్తూ అడుగులు ముందుకువేద్దాం.

Audio Message: https://youtu.be/2uTwtiZrlLc 

Do you change your thoughts for God's purposes?

Matthew 6

In a Christian lifestyle, rather than striving for the livelihood, the thoughts of being accomplished in life are far great. If we put God first in every task and start doing it, we will be successful. Sometimes we face a situation of failure because of our weaknesses. When we think deeply, we can clearly understand that our weakness is our opponent, and it is conquered through the encouragement to accomplish. This encouragement strengthens us in our weaknesses.

Sometimes we say that I have so much experience, such kind of thought may sometimes disappoint us at times. Reason? God cannot reward all that we do based on our own decisions. Whatever experience we might have, only when we put God first before anything else, we will surely be rewarded.

However, people who worry about their future may not be able to achieve anything. Also, they lose their focus on what they are currently working on and experience loss. The frustration of not being able to succeed in all that we have done will depress and fail us. There are many times when we get involved in things that are unrelated to us and worry about them. However, when we cannot focus and work on things that we cannot lead or do not benefit from worrying about “what is happening or what may happen in the future?”. if we focus on God and do work upon His will, rather worrying, we will be successful.

Thinking about “future” and “the goals that we want to reach in our life”, both have a lot of differences. If we consider the things that Jesus Christ taught us when he lived in this world, that we must first seek His righteousness and His kingdom.

We can attain a specific Christian lifestyle only when God becomes our priority among all the work that we do, our family, or job, or business. Prayer is our weapon for success in these things. Praying for a while does not give any results, we must practice praying until we get an answer. Let us change our thinking towards God and take forward steps to achieve them.

https://youtu.be/aj0HZTWSTfQ


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.