శ్రమలలో ఆశీర్వాదం


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

శ్రమలలో ఆశీర్వాదం
Audio: https://youtu.be/x3s-kLiVJ4Y

యోహాను 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

మనము శ్రమలు తప్పించుకొనెదమని దేవుడు ఎప్పుడు వాగ్దానము చేయలేదు కానీ, యేసు క్రీస్తు జయించినట్లుగా మనం కూడా జయించెదమని చెప్పెను. దేవుడు మనలను శ్రమల నుండి తప్పించుటకంటే మనలను జయించు వారిగా చేయుటకు ఎక్కువ ఆసక్తి కాలిగియున్నాడు. మనం దేవుని రూపములోనికి ఆయన స్వభావములోనికి మారాలని ఎక్కువ ఆసక్తి దేవుడు కాలిగియున్నాడు. శ్రమల వలననే క్రీస్తు స్వభావములోనికి మారడం సాధ్యం. ఆత్మీయ జీవితములో ఎదగాలన్న, పరలోకం చేరాలన్న శ్రమలొక్కటే మార్గం.

అపో.కా. 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

దేవుని రాజ్యములో పాలివారము కావాలంటే ముందు మనము ఆయన శ్రమలలో పాలివారము కావాలి.

ప్రియ స్నేహితుడా! నీవు భయంకరమైన శ్రమలలో ఉండొచ్చు. నీవు అనుభవిస్తున్న శ్రమల నుండి తప్పించుకొనే మార్గం కనిపించుటలేదేమో?
ఈ శ్రమలు నాకే ఎందుకొచ్చాయని బాధపడుతున్నవా? శ్రమలు మంచివే, అవి మన మేలుకోసమేనని మర్చిపోవద్దు. శ్రమలలో ఉన్నప్పుడు, ఈ శ్రమల నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్ధించుటకంటే; ఈ శ్రమల ద్వారా అనుభవాలు నేర్పించమని ప్రార్ధన చేయి. శ్రేష్ఠమైన అనుభవాలన్ని శ్రమలలో తప్ప సంతోషంలో నేర్చుకోలేము...ఆమెన్.