అధికమైన కృప


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

అధికమైన కృప
Audio: https://youtu.be/s_GkjN0rNnE

కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు.

కృప అంటే అర్హతలేని పాపులకు దేవుడు - పాపక్షమాపణ, నూతన జీవితమును, ఆత్మీయ జీవితమును అవసరమైన ప్రతిదీ ఉచ్చితముగా ఇవ్వడమే కృప. మన స్థానంలో చనిపోయేందుకు తన సొంత కుమారుని తండ్రి ఇవ్వడము, మనలో జీవించేందుకు తన పరిశుద్దాత్మను ఇవ్వడము దేవుని కృప. మనం ఎన్ని సార్లు వాగ్ధానాలు చేసిన నమ్ముతాడు - అదే దేవుని కృప

పాతాళపు అగాధము అనేది తీవ్రమైన బాధ, నిరాశ, సమాధిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇది దావీదుహారాజు రచించిన కీర్తన. ఈ కీర్తన మొదటిలో నా ప్రాణమును కాపాడమని, నీ సేవకుని రక్షించమని దినమంత దేవునికి మొఱ్ఱపెట్టాడు.

ఆత్మీయ జీవితములో తీవ్రమైన బాధ కలుగుటకు కారణం తొందరపడి, తెలిసి చేసిన తప్పిదం. ఇది సమాధి అనుభవంలోనికి తీసుకెల్తుంది. తెలిసి చేసిన తప్పులు మనిషిలోని సంతోషాన్ని ఆవిరి చేసేస్తుంది. చేసిన ప్రయత్నాలన్ని విఫలమైనప్పుడు నిరాశ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న దావీదుహారాజుకు ఈ సమయంలో ఎవరివల్ల సహాయం దొరకదు భూమ్యాకాశములు సృజించిన దేవుని వలననే సహాయము దొరుకుతుందని తెలుసుకున్నాడు. ప్రార్థనలో క్షమాపణ దొరికినప్పుడే హృదయం సంతోషముతో నింపబడుతుంది. మనం ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, ప్రార్థనకు ఉత్తరమిచ్చే దేవుడు.

ఎలాంటి పరిస్థితిలో మనమున్నా దానిని ఆశీర్వాదముగా మార్చి సమృద్ధితో నింపి సంతోషపరచి తన అధికమైన కృపను విస్తరింపజేస్తున్న యేసయ్యకు మహిమ కలుగును గాక!