ఎవరో తెలుసా యేసయ్యా
-
-
-
- ఎవరో తెలుసా యేసయ్యా
- చెబుతా నేడు వినవయ్యా
- పెడ చెవిపెట్టగ త్వరపడి వచ్చి
- రక్షణ పొందయ్యా వేగమె రక్షణ పొందయ్యా
- 1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
- మరణించాడు మరిలేచాడు - నీ నా పాపవిమోచనకై
- 2. ధనవంతుడై యుండు యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
- రూపురేకలు కోల్పొయాడు - నీ నా పాపవిమోచనకై
- 3. పాపుల రక్షకుడేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
- తనదారి చేరిన పాపులనెల్ల - కడుగును తనదు రక్తంతో