Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా


    • సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
    • చేయుము దేహమును దేవుని కనుకూలముగా

    • 1. ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
    • యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే !!సజీవ!!

    • 2. నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
    • నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు !!సజీవ!!

    • ౩. మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
    • ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు !!సజీవ!!