Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా


    • స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా
    • ఆందుకో నా పూజ ఓ ఘనతేజా - హల్లెలూయా (8)

    • 1. సర్వాధిపతి సర్వోన్నతుడా - సకలముచేసిన సృష్టికర్తవు
    • సర్వశక్తిగల సర్వేశ్వరుడా - సతతము నీవే స్తొత్రార్హుడవు

    • 2. సృష్టికి కారణభూతుడవీవే - రక్షణ కర్తా నిరీక్షణ నీవే
    • ఆదరించుమా ఆత్మ స్వరూపా -అనవరతము నీవే స్తొత్రార్హుడవు

    • 3. పరిశుద్దుడవు ప్రభుడవు నీవే - నిర్దోషుడవు నిష్కల్మషుడా
    • పాపిని నన్ను కాపాడితివి - నిరతము నీవే స్తొత్రార్హుడవు