Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువచెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు


    • సిలువచెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు
    • పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి

    • 1. కొండవంటి బండవంటి - మొండి హృదయంబు మండించు
    • పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర ''సిలువ''

    • 2. వంద గొర్రెల మందనుండి - ఒకటి తప్పి ఒంటరియాయె
    • తొంబదితొమ్మిది గొర్రెలవిడిచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్ ''సిలువ''

    • 3. తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపోయె
    • తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను ''సిలువ''

    • 4. పాపి రావా పాపము విడచి - పరిశుద్దుల విందులో చేర
    • పాపుల గతిని పరికించితివా - పాతాలంబే వారి యంతం ''సిలువ''