Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైన ప్రేమలో వంచన లేదు - కల్వరి ప్రేమలో కల్మషం లేదు


    • విలువైన ప్రేమలో వంచన లేదు - కల్వరి ప్రేమలో కల్మషం లేదు
    • మధురమైన ప్రేమలో మరణం లేదు - శాశ్వత ప్రేమలో శాపం లేదు
    • యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు - అద్భుత ప్రేమలో అరమరిక లేదు

    • 1. వాడిగల నాలుక చేసిన గాయం - శోధన సమయం మిగిల్చిన భారం
    • అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2)
    • నిలువ నీడ దొరికెనె - నిజమైన ప్రేమలో (2) llవిలవైనll

    • 2. నా దోషములను మోసిన ప్రేమ - నాకై సిలువను కోరిన ప్రేమ
    • పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ (2)
    • ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ (2) llవిలువైనll