Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యుద్ధ వీరుడా కదులుముందుకు - పాలు తేనెల నగరకు


    • యుద్ధ వీరుడా కదులుముందుకు - పాలు తేనెల నగరకు
    • వెట్టిచాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు
    • ‘లేదు మనకిక అపజయం యేసు రక్తమె మన జయం
    • హల్లెలూయ ! హొసన్న ! - (3) మనదే విజయం
    • హల్లెలూయ ! హొసన్న ! - (3) మనదే విజయం’ llయుద్ధ వీరుడాll

    • ఏదేమైన గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము
    • ఎర్రసంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
    • యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
    • అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం llలేదుll

    • పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా
    • చింతయే లేదుఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా
    • ఆకలి తీర్చి మన్నా కురియును యేసుని నీడలో
    • దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో llలేదుll

    • గొర్రెపిల్ల రక్తం దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
    • శక్తిచేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
    • యేసుని గొప్ప వాగ్ధానములే నింపెను నిబ్బరం
    • యేసుని యందు వశ్వాసమె మా విజయపు సూచకం llలేదుll

    • rigevidon reddit rigevidon tabletki rigevidon quantity
  • Album: Anil Kumar, Artist: Bro. Anil Kumar, Language: Telugu, Viewed: 1039 times