Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవుంటే నాకు చాలు యేసయ్యా.. నీవెంటే నేను ఉంటా యేసయ్యా


    • నీవుంటే నాకు చాలు యేసయ్యా.. నీవెంటే నేను ఉంటా యేసయ్యా... 
    • నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

    • ఎన్ని బాధలున్ననూ.. ఇబ్బందులైననూ.. ఎంత కష్టమొచ్చినా.. నిష్టూరమైననూ.. 
    • నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

    • బ్రతుకు నావ పగిలినా.. కడలి పాలైననూ.. అలలు ముంచి వేసినా.. ఆశలు అణగారినా.. 
    • నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

    • ఆస్తులన్నీ పోయినా.. అనాధగా మిగిలినా.. ఆప్తులే విడనాడినా.. ఆరోగ్యం క్షీణించినా.. 
    • నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..

    • నీకు ఇలలో ఏదియూ... లేదు అసాధ్యమూ... నీదు కృపతో నాకేదియూ.. కాదిల సమానమూ... 
    • నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2547 times