Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే


  • Play Song :
    • కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే - ఆవిరివంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం..
    • యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..

    • ఎదురౌతారెందరో నీ పయనంలో - నిలిచేది ఎందరు నీ అక్కరలో..
    • వచ్చేదెవరు నీతో మరణమువరకూ - ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు..
    • యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..

    • చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించినా శాంతి వున్నదా...?!
    • ఈరాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - సంపాదన ఎవరిదగును యోచించితివా...?!
    • యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..

    • నీ శాపం తాను మోసి పాపం తీసి - రక్షణభాగ్యం నీకై సిద్ధము చేసి..
    • విశ్రాంతినీయగా నిన్ను పిలువగా - నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా...?!
    • యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 19717 times