Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే


    • పల్లవి : కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
    •            ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం (2)
    •            ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు 
    •            మరణమైన జీవమైన నిన్ను విడువదు (2)

    •        1. ఎదురౌ తారెందరో నీ పయనం లో 
    •            నిలిచేది ఎందరూ నీ అక్కరలో 
    •            వచ్చేదేవరూ నీతో మరణం వరకు (2)
    •            ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు ( ఏసే )

    •        2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
    •            ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
    •            ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే  (2)
    •            సంపాదన ఎవరిదగును యోచించితివా ( ఏసే )

    •       3. నీ శాపం తాను మోసి పాపం తీసి 
    •            రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి 
    •            విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా  (2)
    •            నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా (ఏసే)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1979 times