Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు


    • పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు 
    •            భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
    •            పరలోక మహిమను - దివిదూత గణమును
    •            విడనాడి నన్ను వేడుక వచ్చెను 
    •            ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
    •            పాపి కొరకు ప్రాణమిచ్చెను      (కా)  
    • 1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
    •     కరుణ తోడను - నా కడకు చేరెను
    •     నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు 
    •     నాదు బ్రతుకు మార్చి వేసెను        (కా)
    • 2. మంచి కాపరి - నా చెంత చేరెను 
    •     లేమిని లేకుండా చేసెను 
    •     దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను 
    •     పాతవి గతించెను - గీతమాలపింతును
    •     యేసు తోడ నుందు నిరతము       (కా)
    • 3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను 
    •     కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
    •     నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
    •     కొదువలేదు - దిగులు లేదుగా   (కా)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 405 times