ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
-
-
-
- ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
- అన్వేషించూ అన్వేషించు - ఒక్కసారి అన్వేషించు = 2
- నీ గమనం ఏమైయుందో - నీ గమ్యం ఎక్కడ ఉందో
- ఏ తరుణం ఏమౌతుందో - నీ తీర్పు ఏమైయుందో
- దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు - బదులేమిస్తావో..!?
-
- 1. నీతిగా నువ్వే జీవిస్తే - దేవుని రాజ్యం నీదవదా
- చీకటి దారి నీదైతే - నిప్పుల వలలే ఎదురవవా = 2
- నీ పాపపు జీవితమంతా - ప్రభురక్తంలో కడగాలి
- నీ ఎదలో దేవుని ధ్యానం - వినిపించే స్వరమవ్వాలి
- సగము ఇహము - సగము పరమని జీవిస్తున్నావా..?!
-
- 2. దుష్టుల స్నేహం విడిపోతే - హృదయం దేవుని వశమేగా
- పాపుల మార్గంలో వెళితే - మరణం నీకు శరణవదా = 2
- చెడు పలికే నీ పెదవులకు - ప్రభు ప్రార్ధన ఫలమిస్తుందా
- చెడు చూసే నీ కన్నులకు - పరలోకం కనిపిస్తుందా
- ఇదియే సమయం - ఇపుడే యేసుకు మనసిస్తున్నావా..?!