Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవర నీ దీవెనలు - Devara Nee Deevenalu


    • దేవర నీ దీవెనలు
    • ధారాళముగను వీరలపై
    • బాగుగ వేగమే దిగనిమ్ము
    • పావన యేసుని ద్వారగను (2)

    • దంపతులు దండిగ నీ
    • ధాత్రిలో వెలయుచు సంపదలన్
    • సొంపుగ నింపుగ పెంపగుచు
    • సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ||

    • ఈ కవను నీ కరుణన్
    • ఆకరు వరకును లోకములో
    • శోకము లేకయే ఏకముగా
    • బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ||

    • ఇప్పగిది నెప్పుడును
    • గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
    • మొప్పిన చొప్పున దప్పకను
    • మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ||

    • తాపములు పాపములు
    • మోపుగ వీరిపై రాకుండగా
    • గాపుగ బ్రాపుగ దాపునుండి
    • యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ||

    • సాధులుగన్ జేయుటకై
    • శోధనలచే నీవు శోధింపగా
    • కదలక వదలక ముదమున నీ
    • పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ||

    • మెండుగ భూమండలపు
    • గండములలో వీరుండగను
    • తండ్రిగ దండిగ నండనుండి
    • వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ||

    • యిద్దరు వీరిద్దరును
    • శుద్ధులై నిన్ను సేవించుటకై
    • శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
    • దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ||

    • వాసిగ నీ దాసులము
    • చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
    • మా సకలేశ్వర నీ సుతుడ
    • యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||

    • Devara Nee Deevenalu
    • Dhaaraalamuganu Veeralapai
    • Baaguga Vegame Diganimmu
    • Paavana Yesuni Dvaaraganu (2)

    • Dampathulu Dandiga Nee
    • Dhaathrilo Velayuchu Sampadalan
    • Sompuga Nimpuga Pempaguchu
    • Sahimpuna Veeru Sukhinchutakai      ||Devara Nee||

    • Ee Kavanu Nee Karunan
    • Aakaru Varakunu Lokamulo
    • Shokamu Lekaye Ekamugaa
    • Braakatamuganu Jekonumu              ||Devara Nee||

    • Ippagidi Neppudunu
    • Goppagu Prematho Noppuchu Daa
    • Moppina Choppuna Dappakanu
    • Meppuga Brathukaga Bampu Krupan      ||Devara Nee||

    • Thaapamulu Paapamulu
    • Mopuga Veeripai Raakundagaa
    • Gaapuga Braapuga Daapunundi
    • Yaapadalanniyu Baapuchunu                  ||Devara Nee||

    • Saadhulugan Jeyutakai
    • Shodhanalache Neevu Shodhinpagaa
    • Kadalaka Vadalaka Mudamuna Nee
    • Paadamu Daapuna Baadukonan              ||Devara Nee||

    • Menduga Bhoomandalapu
    • Gandamulalo Veerundaganu
    • Thandriga Dandiga Nandanundi
    • Vendiyu Vaanini Khandinchave           ||Devara Nee||

    • Iddara Veeriddarunu
    • Shudhdhulai Ninnu Sevinchutakai
    • Shradhdhatho Budhdhiga Sidhdhapadan
    • Didhdhumu Nee Priya Biddalugaan       ||Devara Nee||

    • Vaasiga Nee Daasulamu
    • Chesina Ee Moral Deesikoni
    • Maa Sakaleshwara Nee Suthuda
    • Yesuni Perita Brovumaamen                ||Devara Nee||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1125 times