Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది - Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi


    • దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    • మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

    • యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
    • ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||

    • గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    • వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||

    • నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
    • వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||

    • ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    • జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||

    • దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    • సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

    • ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
    • భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని              ||దేవునికి||

    • పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    • అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  ||దేవునికి||

    • గుర్రముల నరులందలి బలము నానందించడు
    • కృప వేడు వారిలో సంతసించువాడని                ||దేవునికి||

    • యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
    • కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని    ||దేవునికి||

    • పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
    • మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును   ||దేవునికి||

    • భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
    • వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును         ||దేవునికి||

    • వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
    • ఏ జనముకీలాగున చేసియుండలేదని               ||దేవునికి||

    • Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
    • Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi

    • Yerushalemu Yehovaye Kattuchunnavaadani
    • Ishrayeleeyulanu Pogucheyuvaadani         ||Devuniki||

    • Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
    • Vaari Gaayamulanniyu Kattuchunnavaadani   ||Devuniki||

    • Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
    • Vaatikanniyu Perulu Pettuchunnavaadani       ||Devuniki||

    • Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
    • Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani    ||Devuniki||

    • Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
    • Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi    ||Devuniki||

    • Aayana Aakaashamun Meghamulatho Kappunu
    • Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani     ||Devuniki||

    • Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
    • Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu     ||Devuniki||

    • Gurramula Narulandali Balamu Naanandinchadu
    • Krupa Vedu Vaarilo Santhasinchuvaadani         ||Devuniki||

    • Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
    • Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani   ||Devuniki||

    • Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
    • Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu    ||Devuniki||

    • Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
    • Vegamugamu Devuni Vaakyamu Parugeththunu        ||Devuniki||

    • Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
    • Ae Janamukeelaaguna Chesiyundaledani           ||Devuniki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 13702 times