Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా - Nadipinchu Naa Naavaa Nadi Sandramuna Devaa


    • నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
    • నవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు||

    • నా జీవిత తీరమున నా అపజయ భారమున
    • నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
    • నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    • నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు||

    • రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
    • రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
    • రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
    • రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు||

    • ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
    • అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
    • ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
    • ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు              ||నడిపించు||

    • ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
    • ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
    • ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
    • ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       ||నడిపించు||

    • లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
    • లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
    • లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
    • లోపించని అర్పనగా లోకేష చేయుమయా         ||నడిపించు||

    • ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
    • ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
    • పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
    • ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు     ||నడిపించు||

    • Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa
    • Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa     ||Nadipinchu||

    • Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna
    • Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
    • Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa
    • Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu            ||Nadipinchu||

    • Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu
    • Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu
    • Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
    • Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava             ||Nadipinchu||

    • Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
    • Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
    • Aasha Nirashaye – Aavedha Nedhuraye
    • Aadhyathmika Lemigani – Allade Naa Valalu                    ||Nadipinchu||

    • Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
    • Parbhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
    • Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
    • Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata              ||Nadipinchu||

    • Lotaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa
    • Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi
    • Lonunna Eevulalo – Lothaina Naa Brathuku
    • Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa               ||Nadipinchu||

    • Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni
    • Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha
    • Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho
    • Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu   ||Nadipinchu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 482 times