Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి - Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi


    • సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
    • యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
    • సంతోషించుడి నాతో సంతోషించుడి       ||సంతోషించుడి||

    • అంధకార మయమైన భూమి నా
    • ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
    • వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
    • భూమికి నిచ్చె ప్రకాశంబు       ||సంతోషించుడి||

    • కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
    • కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
    • మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
    • భక్తుల మనము సంతసించె       ||సంతోషించుడి||

    • మిన్ను నుండి సంతోషోదయము
    • మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
    • మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
    • భక్తుల కన్ను లాస దీరె       ||సంతోషించుడి||

    • ప్రీతియైన నీ పండుగ గూర్చి
    • నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
    • నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
    • దెలుపఁగ నాతురపడవలెను       ||సంతోషించుడి||

    • పాపులపై దేవునికి గలిగిన
    • ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను
    • జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము
    • వేగము జూపుద మా పథము       ||సంతోషించుడి||

    • Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi
    • Yoka Vinthagu Keerthana Baada Vachithini
    • Santhoshinchudi Naatho Santhoshinchudi       ||Santhoshinchudi||

    • Andhakaara Mayamaina Bhoomi Naa
    • Dyanthamu Veligimpa – Daani Yaa-veshamu Dolagimpa
    • Vandhithundu Kreesthesu Naathudu – Vachche Brakaashundai
    • Bhoomiki Nichche Prakaashambu       ||Santhoshinchudi||

    • Kaana Nandhakaarambu Dholaga Pra
    • Kaashinchenu Lendu – Meeru Pra-kaashimpanu Randu
    • Maanavulanu Santhosha Parchanai – Mahini Navatharinche
    • Bhakthula Manamu Santhasinche       ||Santhoshinchudi||

    • Minnu Nundi Santhoshodayamu
    • Migula Prakaashinche – Hrudayamul – Dagula Prakaashinche
    • Munnu Jeyabadina Vaagdhaththamu – Thinnaga Neravere
    • Bhakthula Kannu Laasa Dheere       ||Santhoshinchudi||

    • Preethiyaina Nee Panduga Goorchi
    • Noothana Keerthananu – Galasikoni – Naatho Paaduchunu
    • Nee Thari Doorasthula-kee Vaarthanu – Ne Theerunu Naina
    • Delupaga Naathurapadavalenu       ||Santhoshinchudi||

    • Paapulapai Devuniki Galigina
    • Prabalamaina Dayanu – Lokamun – Joopimpa Gavalenu
    • Joopaka Poyina Lopamu Manapai – Mopabadunu Nijamu
    • Vegamu Joopudha Maa Pathamu       ||Santhoshinchudi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 135 times