Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తుతులపై ఆసీనుడా - Sthuthulapai Aaseenudaa


    • స్తుతులపై ఆసీనుడా
    • అత్యున్నత నా దేవుడా (2)
    • నీ ప్రేమలో నీ ప్రేమలో
    • నను నేను మరిచాను నీ ప్రేమలో
    • నీ నీడలో నీ జాడలో
    • మైమరచిపోయాను నేను ||స్తుతులపై||

    • నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
    • నీవు పొందిన గాయాలకు బదులు (2)
    • బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
    • వెండినడుగలేదు నీవు
    • విరిగి నలిగి – కరిగి వెలిగే
    • హృదయాన్నే కోరావు నీవు (2)
    • ఓ మాట సెలవియ్యి దేవా
    • నీ పాద ధూళిని కానా ప్రభువా
    • నీ పాదం స్పర్శించగానే
    • నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||

    • నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
    • మా బ్రతుకులో విజయము మొదలు (2)
    • మరణం అనేటి ముల్లును విరచి
    • తిరిగి లేచావు నీవు
    • చీకటి నిండిన మాదు బ్రతుకులో
    • వెలుగులు నింపావు నీవు (2)
    • నీకోసం ఏదైనా దేవా
    • నే వెచ్చింప సంసిద్ధమయ్యా
    • ఆఖరికి నా ప్రాణమైనా
    • చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

    • Sthuthulapai Aaseenudaa
    • Athyunnatha Naa Devudaa (2)
    • Nee Premalo Nee Premalo
    • Nanu Nenu Marichaanu Nee Premalo
    • Nee Needalo Nee Jaadalo
    • Maimarchipoyaanu Nenu      ||Sthuthulapai||

    • Neevu Chesina Aascharya Kaaryaalaku Badulu
    • Neevu Pondina Gaayaalaku Badulu (2)
    • Bangaaram Vajraalu Makutaalu Kireetaalu – Vendinadugaledu Neevu
    • Virigi Naligi Karigi Velige – Hrudayaanne Koraavu Neevu (2)
    • O Maata Selaviyyi Devaa
    • Nee Paada Dhoolini Kaanaa Prabhuvaa
    • Nee Paadam Sparshinchagaane
    • Naa Santhoshaaniki Haddhundunaa         ||Sthuthulapai||

    • Neevu Lechina Punaruththaana Dinamu Modalu
    • Maa Brathukulo Vijayamu Modalu (2)
    • Maranam Aneti Mullunu Virachi – Thirigi Lechaavu Neevu
    • Cheekati Nindina Maadu Brathukulo – Velugulu Nimpaavu Neevu (2)
    • Neekosam Edainaa Devaa
    • Ne Vechchimpa Samsiddhamayyaa
    • Aakhariki Naa Praanamainaa
    • Chindulu Vesthu Arpisthaa         ||Sthuthulapai||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 405 times