Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం


    • శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
    • ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా వందనం
    • 1. నీ నామమందు ప్రార్ధించి పొందినాము గొప్ప రక్షణ
    • రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను
    • బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
    • 2. విశ్వాససహితమైన ప్రార్ధన విజయమిచ్చునన్నావయా
    • తండ్రి సముఖమునకు చేర ప్రార్ధన నీ నామముంచినావయా
    • బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
    • 3. పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్టనేర్పినావయా
    • సందేహపడక విధేయతతో ప్రార్ధింపజూపినావయా
    • బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు