Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మధురమైనది నా యేసు ప్రేమ


    • మధురమైనది నా యేసు ప్రేమ
    • మరపురానిది నా తండ్రి ప్రేమ
    • మరువలేనిది నా యేసుని ప్రేమ
    • మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ
    • ప్రేమ. . . ప్రేమ. . . నా యేసు ప్రేమ

    • 1.ఇహలోక ఆశలతో అంధులమైతిమి
    • నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి
    • చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
    • నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం !!ప్రేమ!!

    • 2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
    • మార్గములుచూపి మన్నించితివి
    • మరణపు ఛాయలే దరి చేరనీయక
    • నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం !!ప్రేమ!!