Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది


    • ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
    • నిజము దీనిని నమ్ము - ఇది భువియందించలేనిది
    • ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
    • ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ

    • 1.తల్లిదండ్రుల ప్రేమ-నీడ వలే గతియించును
    • కన్నబిడ్డల ప్రేమ-కలలా కరిగిపోవును

    • 2.భార్య భర్తల మధ్య-వికసించిన ప్రేమ పుష్పము
    • వాడిపోయిరాలును త్వరలో-మోడులా మిగిలిపోవును

    • 3.బంధుమిత్రుల యందు-వెలుగుచున్న ప్రేమ దీపము
    • నూనె ఉన్నంత కాలము-వెలుగు నిచ్చి ఆరిపోవును