4:3 షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;11:29 అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయు డును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.11:30 అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;12:15 జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.14:2 యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యౌవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.14:4 యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను.14:5 అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగాయరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచా రించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతెయైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను.14:6 అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెనుయరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసి కొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.14:18 జనులు అతనిని సమా ధిలోపెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలువారందరును అతనికొరకు అంగ లార్చిరి.15:27 ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.15:29 తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారి నందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవు నిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.15:33 యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.21:22 ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.