లేయా (లేయా)


అడవి ఆవు లేక అలసట

Bible Results

"లేయా" found in 2 books or 31 verses

ఆదికాండము (30)

29:16 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.
29:17 లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.
29:23 రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
29:24 మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
29:25 ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
29:30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.
29:31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
29:32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
30:9 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
30:10 లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
30:11 లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
30:12 లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
30:13 లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
30:14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
30:16 సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
30:19 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
30:20 అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
31:4 యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
31:14 అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
31:33 లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.
33:2 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి¸
33:7 లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.
34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.
35:23 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
35:26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
46:15 వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
46:18 లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే . ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
49:31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.

రూతు (1)

4:11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , యాకోబు , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , గిల్గాలు , రోగము , బేతేలు , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , రక్షణ , సీమోను , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , తామారు , హాము , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help